ఆలూరు: కేజీబీవీ హాస్టల్ సీట్లు పెంచాలని వినతి

2769చూసినవారు
ఆలూరు: కేజీబీవీ హాస్టల్ సీట్లు పెంచాలని వినతి
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని కేజీబీవీ హాస్టళ్లలో సీట్ల సంఖ్యను పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. కె. గిరి సోమవారం కర్నూలులో ఏపీసీ లోకరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. సీట్లు లేకపోవడంతో పలువురు విద్యార్థులు చదువును మధ్యలోనే మానేసి కూలీ పనులకు వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన విద్యార్థులందరికీ వసతి కల్పించేలా సీట్లను పెంచి వారికి న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్