ఆలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో సోమవారం ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) కార్యక్రమంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పార్టీ శ్రేణులకు ఎస్‌ఐఆర్ అమలు, ఓటరు నమోదు, వెరిఫికేషన్ ప్రక్రియపై వైకుంఠం జ్యోతి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ విజయానికి సహకరించిన వారికి వైకుంఠం జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు.