ఆలూరు: మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగలు అరెస్టు

1691చూసినవారు
ఆలూరు: మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగలు అరెస్టు
ఆలూరు పట్టణంలో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటనలో ఇద్దరు నిందితులను ఆలూరు పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 31న ఎల్లార్తి రోడ్డులో నివసిస్తున్న సరోజమ్మను ఫోన్ నెంబర్ అడుగుతూ ఆమె మెడలోని 3.50 తులాల బంగారు గొలుసును లాక్కొని కారులో పరారైన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3.50 తులాల బంగారం, టయోటా గ్లాంజా కారును స్వాధీనం చేసుకున్నారు. సీఐ రవిశంకర్ రెడ్డి, ఎస్సై మన్మధవిజయ్ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్