ఆలూరు: ఇళ్ల హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసిన విరుపాక్షి

692చూసినవారు
ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి, ఆలూరు అబ్జర్వర్ రామచంద్ర రెడ్డి గురువారం పత్తికొండలో మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు సొంత ఇల్లు కల నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క మహిళకైనా సెంటు భూమి కేటాయించారా అని ప్రశ్నించిన ఆయన, నిరుపేదలకు ఒక్క ఇల్లు అయినా నిర్మించి ఇచ్చామనే విషయాన్ని ప్రభుత్వం నిరూపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 3.5 లక్షల కోట్లు అప్పు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టివేసిందని, ఆ అప్పుతో ఏమి చేశారని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్