బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం సోమవారం ఉదయం 10 గంటలకు ఎమ్మిగనూరు గెస్ట్ హౌస్ నందు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణ, రాష్ట్ర వాల్మీకి భాయ్ చార కన్వీనర్ బోయ రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. జిల్లా ఇన్చార్జులు, అధ్యక్షులు, కమిటీ సభ్యులు, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు తప్పకుండా హాజరు కావాలని పార్టీ ఆదేశించింది. ఈ సమావేశంలో జిల్లా స్థాయి స్థానిక సంస్థ ఎన్నికల సన్నాహక వివరాలు, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలు వివరించబడతాయి.