అంగన్వాడీ మహిళపై మీ కార్యకర్త పెత్తనం ఎందుకు చంద్రబాబూ

3346చూసినవారు
ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ లేపాక్షి ఆత్మహత్యాయత్నం ఘటనపై ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి స్పందించారు. మంగళవారం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించి పార్టీ తరఫున నైతిక మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్త వేధింపుల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. బాధ్యుడిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్