బుధవారం ఆస్పరి మండలంలోని చిరుమాన్ దొడ్డి బస్టాప్ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆస్పరి నుంచి ఆదోని వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో రఫిక్, సూరజ్, ముకేష్, కిరణేవి, అజయ్‌తో పాటు మరొకరు ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆస్పరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదోనికి తరలించారు.