గ్రామాల అభివృద్ధికి పరిశుభ్రతే కీలకం: విజయ్ భాస్కర్ గౌడ్

192చూసినవారు
ఆలూరు, కర్నూలులో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నేలతలమర్రి గ్రామంలోని ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రపరిచి, గ్రామాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్, సర్పంచ్ నాగరాజు గౌడ్ అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్