హాలహర్వి: ట్రాన్స్ఫార్మర్, మోటార్లు చోరీ – అన్నదాతల ఆవేదన

611చూసినవారు
హాలహర్వి: ట్రాన్స్ఫార్మర్, మోటార్లు చోరీ – అన్నదాతల ఆవేదన
హాలహర్వి మండలం నిట్రవట్టిలో దుండగులు వ్యవసాయ పొలాల్లో చోరీలకు పాల్పడ్డారు. బుధవారం, స్థానిక రైతులు తమ పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు దొంగిలించబడ్డాయని తెలిపారు. రైతు వడ్డే యల్లాలింగ పొలం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత, బుధవారం తిరిగి వచ్చి చూసేసరికి ట్రాన్స్ఫార్మర్ కింద పడివుండగా, దానిలోని కాపర్ వైర్లు, ఆయిల్ అపహరించబడ్డాయి. అలాగే, వడ్డే యల్లాలింగ, నాగలింగయ్య, మారెప్ప, మోహన్‌లకు చెందిన విద్యుత్ మోటార్లను కూడా దొంగిలించారు. ఈ ఘటనలతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్