హెబ్బటం: శ్రీసర్పయోగి స్వామి దేవాలయ ప్రారంభం

474చూసినవారు
హెబ్బటం: శ్రీసర్పయోగి స్వామి దేవాలయ ప్రారంభం
ఆదివారం, ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో శ్రీసర్పయోగి స్వామి దేవాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి, శ్రీకనకదాస్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి పూజలు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని, గ్రామాభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక చైతన్యం కూడా అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you