తెలుగుదేశం పార్టీ ఆలూరు నాయకురాలు జ్యోతి,
వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవాన్ని విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ, ఇది వెన్నుపోటు దినోత్సవం కాదని, ప్రజా సంక్షేమ దినోత్సవమని పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత ఇసుక, భూ రికార్డుల సంస్కరణలు వంటి కార్యక్రమాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, యువశక్తి, రైతు పెట్టుబడి సాయం వంటి హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె అన్నారు.