కర్నూల్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి
కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని, రైతులకు సహాయం అందించాలని, కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆలూరు మండల సమితి డిమాండ్ చేసింది. ఆలూరు, మొలగవల్లి గ్రామ సచివాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు శుక్రవారం అందజేశారు. వర్షాభావంతో పత్తి, వేరుశనగ, కంది, ఆముదం, ఉల్లి, టమోటా వంటి పంటలు నష్టపోయాయని పార్టీ నాయకులు తెలిపారు.