ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమరావతి ప్రాంతంలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రతిపక్ష నాయకులు, రైతులపై దాడులు జరగడం ఆందోళనకరమని ఆయన అన్నారు. రైతుల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, దాడులకు భయపడబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.