నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూడాలీ

177చూసినవారు
హోళగుందలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టి.యం.రమేష్ మాదిగ హత్యపై ఎమ్మార్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం వాకింగ్ చేస్తున్న రమేష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్‌తో ఢీకొట్టి రాళ్లతో దాడి చేయగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హోళగుంద ఎంఆర్పీఎస్ నాయకులు తహశీల్దార్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూడాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్