ఇంటి వద్దకే పింఛన్: కూటమి ప్రభుత్వం చర్యలు - సర్పంచ్ సుధాకర్

367చూసినవారు
ఇంటి వద్దకే పింఛన్: కూటమి ప్రభుత్వం చర్యలు - సర్పంచ్ సుధాకర్
ఆలూరు మండల పరిధిలోని మడ్డి లింగందల్లి గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సర్పంచ్ సుధాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పింఛన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్ అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందుతుందని, సచివాలయ సిబ్బందితో పాటు తాము ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, సర్పంచ్ సుధాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్