నేలతలమర్రిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

1647చూసినవారు
నేలతలమర్రిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
కర్నూలు జిల్లా ఆలూరు మండలం నేలతలమర్రి గ్రామంలో శుక్రవారం శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి ఉదయం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ రామచంద్రమూర్తికి, సీతమ్మవారికి కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు, గ్రామస్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారిని, అమ్మవారిని రథంపై ఊరేగించారు. ఈ ఊరేగింపులో బాలికలు కళా ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్