ఆస్పరిలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గాంధీ పార్క్ ముందు జెండా ఆవిష్కరించి, నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సంజప్ప, మండల యూత్ నాయకులు రంగనాథ్, సతీష్ కుమార్ మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవం, జాతి కీర్తి కోసం పోరాడిన మహాయోధుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.