అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆగ్రహం, క్షమాపణకు డిమాండ్

599చూసినవారు
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆగ్రహం, క్షమాపణకు డిమాండ్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే అంబటి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు. అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, తక్షణమే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నేతపై వ్యక్తిగత దూషణలు చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అని టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.