
ఆవుకు బస్సు ప్రమాదంపై మంత్రి జనార్దన్ రెడ్డి స్పందన
బనగానపల్లె నుంచి తాడిపత్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం అవుకు రిజర్వాయర్ వద్ద లారీని ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి విచారణ జరపాలని సూచించారు.



































