గురువారం అవుకు మండలం జునుంతల గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఆటో డ్రైవర్ కార్తీక్ బ్లడ్ క్యాన్సర్‌తో మృతి చెందాడు. సాయంత్రం అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి చేరడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. యువకుడి అకాల మరణంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.