బనగానపల్లె మండలంలో వడదెబ్బతో మహబూబ్ హుసేన్ (32) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నందివర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పండ్లాపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించి బైక్‌పై వెళ్తుండగా వడదెబ్బకు గురై చెట్టు కింద పడిపోయి మరణించినట్లు రూరల్ సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. మృతుడి తల్లి వహిదాబాను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.