కేంద్ర ప్రభుత్వము తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని వెంటనే ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వము ఉపసంహరించి గతంలో ఉన్న వక్ఫ్ బోర్డు బిల్లును యధావిధిగా కొనసాగించాలని ముస్లిం అడ్వకేట్ ఫోరం డిమాండ్ చేసింది. మంగళవారము ఫోరం ఆధ్వర్యంలో ముస్లిం న్యాయవాదులు బనగానపల్లె సివిల్ కోర్టు ఆవరణము నుండి పెట్రోల్ బంకు వరకు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు.