మండల పరిధిలోని నిలువుగండ్ల సమీపంలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అవుకు మండలం శివవరం గ్రామానికి చెందిన సుశీలమ్మ (45) అనే మహిళ, మరో ఇద్దరితో కలిసి ఆటోలో బనగానపల్లికి వెళ్లి, పనులు చూసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. నిలువుగండ్ల సమీపంలో ఆటో విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో బోల్తాపడి సుశీలమ్మ మృతి చెందింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం బనగానపల్లి వైద్యశాలకు తరలించారు. బనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.