కొలిమిగుండ్ల: టీడీపీ నేత బంగి హుస్సేనయ్య మృతి

0చూసినవారు
కొలిమిగుండ్ల: టీడీపీ నేత బంగి హుస్సేనయ్య మృతి
బెలుం గ్రామానికి చెందిన టీడీపీ నేత బంగి హుస్సేనయ్య మృతి పట్ల సీనియర్ నేత ఇటిక్యాల బాలిరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న ఆయన, హుస్సేనయ్య భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం హుస్సేనయ్య చేసిన కృషిని కొనియాడారు. పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.