కొలిమిగుండ్ల మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన జూటూరు పుష్పావతి (40) కుటుంబ సమస్యలతో విరక్తి చెంది పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.