శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో పది మంది భక్తులు మృతి చెందడంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి శనివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.