నంద్యాల: ఒకరి దుర్మరణం.. 10 మందికి గాయాలు

0చూసినవారు
నంద్యాల: ఒకరి దుర్మరణం.. 10 మందికి గాయాలు
బనగానపల్లె (M) లోని దద్దనాల చెరువు సమీపంలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్నరాజుపాలెం నుంచి 15 మంది ఆటోలో తమ్మడపల్లెకు పనులకు వెళ్లి, సాయంత్రం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, డ్రైవర్ మహేశ్ అతివేగంగా నడపడంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో శేషమ్మ (55) అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను బనగానపల్లె వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్