ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి

2చూసినవారు
ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి
నంద్యాల జిల్లా అవుకు మండలంలోని రామాపురంలో శనివారం సాయంత్రం ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. గనుల్లో రాళ్లు లోడ్ చేసుకుని వస్తున్న నాపరాళ్ల ట్రాక్టర్ అదుపుతప్పి 20 అడుగుల లోతు గల గని గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న వెంకట రాముడు (50) అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు కార్మికులతో కలిసి ఆయన రాళ్లు లోడ్ చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్