రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

0చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలులోని కృష్ణనగర్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదంలో ఖాసీం బాషా (50) అనే వ్యక్తి మృతి చెందాడు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని నందవరం గ్రామానికి చెందిన అతను ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ అతని తలపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని ఎల్ఐసీ ఏజెంట్గా గుర్తించారు.

సంబంధిత పోస్ట్