యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. మరియదాసు

0చూసినవారు
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..  మరియదాసు
నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలోని ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ మరియదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెకెఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మరియదాసు యువతే దేశ సంపద అని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. బ్రహ్మానందచారి గంజాయి, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్, ఇతర పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను వివరించి, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి కరపత్రాలను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్