
డోన్: వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
డోన్ జాతీయ రహదారిలోని యు. కొత్తపల్లి వంతెన సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో, వెనుక నుంచి వచ్చిన వాహనాలు మృతదేహంపై నుంచి వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జు అయింది. మృతుడిని గుర్తించడం కష్టంగా ఉందని ఎస్సై శరతక్కు మార్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.







































