నంద్యాల జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ ఇంతియాజ్ బాషా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 1250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మత్తుపదార్థాల విక్రయం, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.