డోన్‌: భారీ మోసం కలకలం.. మహిళల ఆందోళన

18చూసినవారు
డోన్‌: భారీ మోసం కలకలం.. మహిళల ఆందోళన
డోన్ మండలం మిద్దపల్లెలో వెలుగు మహిళల పొదుపు డబ్బుల్లో భారీ మోసం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన మహిళలు తమ కష్టార్జితమైన పొదుపు డబ్బులను బుక్‌ కీపర్ చెన్నకేశవులుకు నమ్మి అప్పగించగా, అతను రూ.లక్షల్లో మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై నిరసనగా, బాధితులైన మహిళలు డోన్‌లో వెలుగు కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించి, తమకు న్యాయం చేయాలని, డబ్బులు తిరిగి ఇప్పించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్