డోన్ పట్టణం 1వ వార్డ్ KVS కాలనీలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి శనివారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమ పథకాలు పారదర్శకంగా అర్హులందరికీ చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కొత్త కార్డుల ద్వారా నిత్యావసరాలు సులభంగా పొందగలమని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.