బనగానపల్లె నుంచి డోన్‌కు వెళ్తుండగా దద్దనాల చెరువు వద్ద గురువారం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో న్యాయం పేపర్ ఎడిటర్ శివానందం, ఆయన భార్యకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని బనగానపల్లె ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.