డోన్ - Dhone

వీడియోలు


రంగారెడ్డి జిల్లా
అమెరికాకు ప్రపంచ దేశాలతో బంధాలు దెబ్బతినే ప్రమాదం
Jan 12, 2026, 15:01 IST/

అమెరికాకు ప్రపంచ దేశాలతో బంధాలు దెబ్బతినే ప్రమాదం

Jan 12, 2026, 15:01 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తెంపరితనం, మొండితనంతో ప్రపంచ దేశాలపై కొరడా ఝళిపించాలన్న అత్యుత్సాహం పలువురికి ఇబ్బందికరంగా మారుతోందని విశ్లేషకులు అంటున్నారు. వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించడం, గ్రీన్ ల్యాండ్ ద్వీపాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించడం, ఇరాన్ అంతరంగిక వ్యవహారాల్లో తలదూర్చడం, సిరియాపై వైమానిక దాడులు చేయడం, మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలపై డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయని ఆరోపించడం వంటి చర్యలు ట్రంప్ నిరంకుశ ధోరణిని తెలియజేస్తున్నాయి. ఈ వ్యవహారశైలి కొనసాగితే అమెరికాకు ప్రపంచ దేశాలతో బంధాలు దెబ్బతిని, ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదముందని విశ్లేషకులు అంటున్నారు.