
డోన్ లో ఈ నెల 20న భారీ జాబ్ మేళా
డోన్ పట్టణంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఈ నెల 20న జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో 13 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, 18–30 ఏళ్ల వయసు గల, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు హాజరుకావచ్చని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్రీకాంత్ రెడ్డి సోమవారం తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 25 వేల వరకు జీతం అందించబడుతుంది.






































