
డోన్ అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే కోట్ల ఆగ్రహం
డోన్ ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, అధికారులు పనుల అమలులో చూపుతున్న లోపాలు, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆలస్యాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో బాధ్యతారహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సేవలో పారదర్శకత, వేగం, కర్తవ్య నిబద్ధతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.







































