
గూడూరు పీహెచ్సీలో పీఎంఎస్ఎంఏ కార్యక్రమం
గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా సంచార చికిత్స నోడల్ అధికారి డా. రఘు సందర్శించారు. ఆయన గర్భిణీలను పరీక్షించి, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. హైరిస్క్ గర్భిణీలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, పోషకాహారం తీసుకోవాలని, వారానికి ఒక్కసారైనా ఫాలోఅప్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. షఫీయా బేగం, డా. సుప్రియ, నర్స్ అంజలి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



































