కర్నూలులో బాల నేర నియంత్రణపై అవగాహన శిక్షణ

321చూసినవారు
కర్నూలులో బాల నేర నియంత్రణపై అవగాహన శిక్షణ
బాల నేర స్వభావాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి, వారికి సరైన మార్గదర్శనం చేయాలని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. కబర్థి, కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి గురువారం స్థానిక జిల్లా కోర్టులో నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాలల హక్కుల కర్తవ్యాల ప్రకారం, పోలీస్, సంబంధిత అధికారులు బాల నేరస్తులపై అవగాహన కలిగి ఉండాలని, చిన్నపిల్లల్లో నేర స్వభావ లక్షణాలను గుర్తించి, కౌన్సిలింగ్, విద్యాబోధన ద్వారా మార్పు తీసుకురావడం అత్యవసరమని చైర్మన్ జి. కబర్థి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్