కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కోడుమూరు, కుర్నూరు, కప్పట్రాళ్ల, హోసూరు, ఆస్పరి గ్రామాల్లో పర్యటించారు. రేపు జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నద్ధతను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించారు. ఎన్నికల విధుల్లో అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా భద్రతా ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలు జారీ చేశారు.