సి. బెళగల్: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

2909చూసినవారు
సి. బెళగల్: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలం కంపాడు గ్రామంలో అప్పుల బాధతో రైతు కురువ వీర నాగన్న (36) మంగళవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, 2. 33 ఎకరాల భూమిలో సాగు చేసిన పంటలు దెబ్బతినడంతో సుమారు రూ. 15 లక్షల అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. మనస్తాపంతో పురుగుల మందు సేవించిన ఆయనను కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్