ప్యాలకుర్తిలో ఘర్షణ.. నలుగురికి గాయాలు

2155చూసినవారు
ప్యాలకుర్తిలో ఘర్షణ.. నలుగురికి గాయాలు
కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో మంగళవారం ఇంటి ముందు మురుగునీరు పారే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో గడ్డపారలు, కర్రలతో దాడులు జరిగాయి. దాడుల్లో తిమ్మన్న, రంగన్న, రవి, సురేష్‌లకు తలకు గాయాలయ్యాయి. వీరిలో తిమ్మన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాడులకు టిడిపి నాయకుల మద్దతు ఉందని బాధితులు ఆరోపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్