కర్నూలు జిల్లా పోలీసుశాఖ డాగ్ స్క్వాడ్‌కు చెందిన పోలీసు డాగ్ టీనా (జాగీలం) మంగళవారం మృతి చెందింది. 2014 నుంచి 2023 వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 9 సంవత్సరాల పాటు సేవలందించిన ల్యాబ్ బ్రీడ్‌కు చెందిన ఈ ఫీమేల్ డాగ్ వృద్ధాప్య కారణాలతో కర్నూలు వెటర్నరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. దిన్నేదేవరపాడు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఏఆర్ అధికారులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు. విఐపి బందోబస్తు, ఎన్నికలు, శ్రీసైల శివరాత్రి, తిరుమల బ్రహ్మోత్సవాల్లో టీనా విశేష సేవలందించిందని అధికారులు తెలిపారు.