కృష్ణాపురంలో నీటి భద్రత, అభివృద్ధిపై చర్చ

445చూసినవారు
కృష్ణాపురంలో నీటి భద్రత, అభివృద్ధిపై చర్చ
కోడుమూరు మండలం కృష్ణాపురం గ్రామంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో నీటి సంరక్షణ, సాగునీటి మెరుగుదలపై రైతుల అభిప్రాయాలు సేకరించారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో చెరువులు, కాలువల అభివృద్ధిపై చర్చించారు. ఉర చెరువులోని ముళ్లపొదలు తొలగించి, కట్ట మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్