కర్నూలు, మంత్రాలయం పరిధిలోని పెద్దకడబూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం బుధవారం అట్టహాసంగా జరిగింది. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నెలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక పింఛన్ల కోసం సుమారు రూ. 3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు.