గూడూరు నగర పంచాయతీ రెండవ గ్రూపులో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పట్టణ
కాంగ్రెస్ అధ్యక్షుడు బండి రాజు పాల్గొన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని, తద్వారా పోలియో వ్యాధిని నిర్మూలించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఎదగడానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.