దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పుపై దళిత సామాజిక నేత బి. సుభాకర్ మాదిగ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం గూడూరులో ఆయన మాట్లాడుతూ, న్యాయవ్యవస్థ, పార్లమెంట్, రాష్ట్రపతికి చిత్తశుద్ధి ఉంటే మత మార్పిడి ఆధారంగా హోదాలు తొలగించడం కాకుండా కుల వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని, అయితే ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధమని ఆయన విమర్శించారు.