కోడుమూరు: విత్తనాల నాణ్యతపై ఏవో తనిఖీలు

4356చూసినవారు
కోడుమూరు: విత్తనాల నాణ్యతపై ఏవో తనిఖీలు
సోమవారం కోడుమూరు మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్ విత్తన దుకాణాన్ని వ్యవసాయ శాఖ అధికారి రవిప్రకాష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కందులు, మినుములు, ఆముదం విత్తనాలకు సంబంధించిన నాలుగు నమూనాలను సేకరించి, నాణ్యత పరీక్షల కోసం తిరుపతి సీడ్ టెస్టింగ్ ల్యాబ్‌కు పంపించారు. రైతులకు విత్తనాలు విక్రయించేటప్పుడు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, తగిన వర్షపాతం తర్వాతే విత్తుకోవాలని విత్తన డీలర్లకు అధికారులు సూచించారు. ఈ తనిఖీలో మండల వ్యవసాయ అధికారి, దుకాణ యజమాని చెన్నప్ప పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్