కోడుమూరు: అంబటి వ్యాఖ్యలు అప్రజాస్వామికం: విష్ణువర్దన్‌రెడ్డి

1124చూసినవారు
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను కేడీసీసీబీ చైర్మెన్ విష్ణువర్దన్‌రెడ్డి అప్రజాస్వామికమని విమర్శించారు. మంగళవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కల్తీ నెయ్యి కేసులో వైసీపీ నేతలు దోషులుగా తేలడంతో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఇటువంటి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని, అంబటి రాంబాబు తక్షణమే సీఎంకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్